వాస్తవం ప్రతినిధి: జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత.. అమెరికాలో నల్లజాతీయులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. నిరసనకారులు అనేక ప్రాంతాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు, ఇతర విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిశ్చయించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసేవారిని జైలులో వేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని.. చట్టం ప్రకారం శిక్షించాలని ఆయన తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. కాగా, జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం చోటు చేసుకున్న నిరసనల్లో వైట్ హౌస్ దగ్గరలోని మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోకుండా నిరసనకారులు వ్యవహరిస్తున్నట్లు ఆయన చెప్పారు.