గాసిప్స్ పై మండిపడ్డ రకుల్

వాస్తవం ప్రతినిధి: మీడియాపై రకుల్ ప్రీత్ సింగ్ కి కోపం వచ్చింది. మీడియా లో గాసిప్స్ రాస్తున్న వారిపై మండిపడింది. శివకార్తికేయన్ హీరోగా తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఆ చిత్రం లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. అయితే, ఇప్పుడు షూటింగులు మొదలవుతున్నా, తను మరో రెండు నెలల వరకు షూటింగులో జాయిన్ కానంటూ రకుల్ దర్శక నిర్మాతలకు చెప్పిందనీ, దాంతో ఆగ్రహించిన నిర్మాత ఆమెను చిత్రం నుంచి తొలగించారనీ తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి.

దీనిపై మండి ప‌డ్డ ర‌కుల్‌.. బాధ్యత యుతమైన జర్నలిజం ఎప్పుడు వస్తుంది, మీడియా నిజాలను తెలుసుకొనే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంది, కొన్ని హిట్స్ కోసం మరీ దిగజారిపోతున్నారు. అసలు ఎవరు ఎక్కడ షూటింగ్స్ జరుపుతున్నారో నాకు చెప్పండి. ఇక్కడ పనిలేక చచ్చిపోతున్నాం” అని పోస్ట్ చేశారు.