అమ్మా.. నిర్మలమ్మా..మీరు పొరపాటు పడినట్టున్నారు: సోమిరెడ్డి

వాస్తవం ప్రతినిధి: ఇంధన చార్జీల పెంపు విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సోమిరెడ్డి స్పందించారు. కరెంట్ చార్జీల విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పప్పులో కాలేసినట్టున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్రం రూ.2.70కే కరెంట్ ఇస్తుంటే ఏపీలో రూ.9 వసూలు చేస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. కానీ రూ.9 కాదు..రూ.9.95 వసూలు చేస్తున్నారమ్మా తల్లీ.. ఇది బహుశా కరోనా కానుకేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెట్రో ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.30 ఉండగా కేంద్రం ఒక రూ.25, రాష్ట్రం మరో రూ.30కి పైగా పన్ను వేసి రూ.85కి చేశారని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో రూ.10 పెంచడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

గతంలో ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం రూ.2 వరకు పన్ను భారం తగ్గించిందని గుర్తుచేశారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఈ సమయంలో పోటీపడి పన్నుల భారం పెంచుకుంటూ పోవడం దురదృష్టకరమని నిర్మలాసీతారమన్ వ్యాఖ్యానించారు.