తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతున్న గరం గరం వార్త!

వాస్తవం ప్రతినిధి: తమిళ రాజకీయాల్లోకి చిన్నమ్మ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ వార్తను తమిళనాట హాట్ టాపిక్ గా చర్చించుకొంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు .
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు శశికళ నటరాజన్ వచ్చేనెల 14వ తేదీన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. దీనిపై తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆశీర్వాదం ఆచారి చేసిన ఓ ట్వీట్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో శశికళ విడుదల కాబోతున్నారనే వార్తలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమౌతున్నాయి.