మెర్ల్‌బోన్ క్రికెట్ క్లబ్ సరికొత్త చరిత్ర..!!

వాస్తవం ప్రతినిధి : క్రికెట్ నిబంధనల తయారీ సంస్థ మెర్ల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రారంభమై 233 సంవత్సరాలైంది. ఇన్నేండ్ల తరువాత ఈ క్లబ్ కొత్త చరిత్రను లిఖించబోతున్నది. మొదటిసారి ఎంసీసీ అధ్యక్ష పదవిని ఒక మహిళ అధిష్టించబోతున్నది. ఆమె ఎవరో కాదు.. ఇంగ్లండ్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ అయిన క్లేర్ కోనార్. శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర స్థానంలో కానర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఈ క్లబ్‌కు మొదటిసారి ఒక మహిళను ఎంసీసీ అధ్యక్షురాలుగా చేస్తున్నారు. ప్రస్తుత చైర్మన్‌ కుమార సంగక్కర స్థానంలో క్లైర్ కోనోర్ వచ్చే ఏడాది అక్టోబర్‌లో నియమితులవుతారు. కుమార్ సంగక్కర స్వయంగా ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డులో మహిళల క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ క్లైర్ కోనార్ నామినేషన్ ప్రకటించారు. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో.. క్లైర్ కోనార్ ఎంసిసి అధ్యక్ష పదవిని నిర్వహిస్తారని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెల్లడించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 1 న కోనార్ ఈ పదవిని చేపట్టనున్నారు.