కరోనా బారిన పడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత!

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వి కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయనకు అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, ఈ ఉదయం పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయి చికిత్స చేయించుకోవడం ప్రారంభించారు.

కాగా, ఇటీవలి కాలంలో ఆయన్ను కలిసిన ఇతర కాంగ్రెస్ నేతలు, సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, అభిషేక్ త్వరగా కోలుకోవాలని పలువురు లాయర్లు, కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. ఇదిలావుండగా, దేశ రాజధానిలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 70 వేల మందికి పైగా వైరస్ సోకగా, 2,300కు పైగా మరణాలు సంభవించాయి.