విశాఖవాసులకు గుడ్‌న్యూస్!

వాస్తవం ప్రతినిధి: విజయవాడ, విశాఖవాసులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సిటీ సర్వీసుల్ని ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలోనే విజయవాడ, విశాఖలో సిటీ బస్సులను నడిపేందుకు ప్లాన్ చేస్తోంది. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఒకే రేటు ఉండేలా ధరలను నిర్ణయించి సర్వీసులను నడపాలని చూస్తున్నది. కోవిడ్ మార్గదర్శలకు అనుగుణంగా సర్వీసులను నడపనున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుని బస్సు సర్వీసుల్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.