చరణ్ ప్లేస్ లో మరో హీరో ..??

వాస్తవం సినిమా: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ ఓ రోల్ చేయబోతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. సామాజిక అంశం తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ వేసవిలో చేయాల్సి ఉండగా లాక్ డౌన్ వలన ఆగిపోవటంతో తాజాగా ఆ క్యారెక్టర్ నుండి రామ్ చరణ్ డ్రాప్ అవుతున్నట్లు, తన పాత్రలో వేరే యువ నటుడిని రామ్ చరణ్ తీసుకోబోతున్నట్లు టాక్. దీనికి సంబంధించి చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు త్వరలోనే ఆ నటుడి పేరు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.