సుశాంత్ సింగ్ మరణ వార్త పై స్పందించిన రేణుదేశాయ్…!!

వాస్తవం సినిమా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణ వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు పలు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా తాజాగా ఈ విషయంపై రేణుదేశాయ్ స్పందించింది. చాలా టాలెంటెడ్ నటుడు సుశాంత్ సింగ్ ఈ విధంగా చేయకుండా ఉంటే బాగుండేది అని తెలిపింది. నటనలో ఎంతో మెలుకువలు కలిగి, ఉన్నత స్థాయికి వెళ్లిన సుశాంత్ సింగ్ మనస్తత్వం చాలా సున్నితమైనది అని వ్యాఖ్యానించింది. కానీ సుశాంత్ సింగ్ కొన్ని భావోద్వేగాలను తన మైండ్ లో బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు అని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు సాధించి ధైర్యంతో ఉండాల్సిన అతను తీవ్ర డిప్రెషన్ కి గురయ్యాడు. అందుకే అలాంటి కఠినమైన‌ నిర్ణయం తీలుకున్నాడు. ఇక సినిమాల్లోకి వచ్చే ఎవరైనా సరే.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ని నమ్ముకొని రావొద్దు. ఒక మంచి న‌టుడిగా కొనసాగలి అంటే.. మనోధైర్యం కూడా చాలా అవసరం.. అంటూ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.