మణిపూర్ ఎమ్మెల్యేలు యూ టర్న్..షా మార్క్ పడిందిగా!

వాస్తవం ప్రతినిధి: మణిపూర్ రాజకీయాల్లో బీజేపీ నేత అమిత్ షా వ్యూహం ఫలించింది.. మణిపూర్ లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పిన ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడగా, ఆ వెంటనే రంగంలోకి దిగిన అమిత్ షా, నడ్డా, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించాయి.
ఎన్పీపీ రెబల్ ఎమ్మెల్యేలు అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం మేఘాలయా ముఖ్యమంత్రి కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ, మణిపూర్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతును కొనసాగించాలని నిర్ణయించిందని హిమాంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో గత రాత్రి వెల్లడించారు. “కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ బృందం మణిపూర్ డిప్యూటీ సీఎం వై జాయ్ కుమార్ తో కలిసి న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. మణిపూర్ లో ప్రభుత్వానికి ఇబ్బందులు లేవు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్పీపీ తమ మద్దతును కొనసాగిస్తుంది” అని హిమాంత తెలియజేశారు.