జగన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన ఉండవల్లి..!!

వాస్తవం ప్రతినిధి: మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ కొడుకుగా వైయస్ జగన్ అంటే గౌరవం ఉంటుంది గాని, తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అని పేర్కొన్నారు. న్యాయస్థానాల తో మరియు ప్రభుత్వ అధికారులతో సఖ్యత గా ఉండాలి గాని వాళ్లతో గొడవలు పెట్టుకుంటే ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ జరుగుతుందని తెలియజేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ప్రభుత్వానికి అంత దూకుడు పనికిరాదని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పట్టాల విషయంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన లెటర్ సీఎం కి పంపిస్తే ఇప్పటివరకు స్పందన రాలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా ఇసుక విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తా అని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్… ఈ విధంగా పరిపాలిస్తే చంద్రబాబు కి పట్టిన గతే పడుతుందని పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఫుల్లుగా లెఫ్ట్ అండ్ రైట్ వైయస్ జగన్ కి ఇచ్చారు ఉండవల్లి.