యోగా ప్రపంచానికి ఇండియా ఇచ్చిన గొప్ప బహుమతి : రాష్ట్రపతి

వాస్తవం ప్రతినిధి: ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్‌ యోగా అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పైవిధంగా స్పందించారు. తాను యోగా చేస్తూ దిగిన పలు ఫొటోలను ప్రెసిడెంట్ కోవింద్ ట్వీట్ చేశారు. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రాచీన శాస్త్రం అయిన యోగా ప్రపంచానికి ఇండియా ఇచ్చిన గొప్ప బహుమతి. దీన్ని చాలా మంది స్వీకరిస్తుండటం హ్యాపీగా ఉంది. యోగా సాధన చేయడం ద్వారా శరీరాన్ని ఫిట్‌గా, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు’ అని కోవింద్ ట్వీట్ చేశారు.