పెంగ్విన్- రివ్యూ

నటీనటులు: కీర్తి సురేష్, ఆదిదేవ్, లింగ, అద్వైత్, హరిణి, నిత్య తదితరులు

సంగీతం: సంతోష్ నారాయణ్

కెమెరా: కార్తీక్ పళని

నిర్మాతలు: కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం, సుందరం, జయరాం

ర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్

ఇంట్రడక్షన్ :

డైరెక్టుగా ఓటిటి ప్రకటించిన చిత్రాలలో అమితంగా ఆకట్టుకున్న సినిమా పెంగ్విన్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ బిడ్డ కి తల్లిగా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకులలో అసక్తిని రేకెత్తించడం తో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ అవటంతో మరి అంచనాలను రీచ్ అయిందో లేదో తెలుసుకుందాం.

స్టోరీ:

కీర్తి సురేష్ కి తన రెండేళ్ల కొడుకు అజయ్ అంటే ప్రాణం. ఆ రెండు ఏళ్ళ కొడుకు ఒకరోజు కనిపించకుండా పోతాడు. తన గారాల కొడుకు కోసం కీర్తి సురేష్ అంతటా వెతికి వెతికి అలసిపోతుంది. ఏడాది గడిచినా గాని కీర్తి సురేష్ తన కొడుకు కోసం వెతుకులాట కొనసాగిస్తూనే ఉంటుంది. దీని వల్ల మానసికంగా దెబ్బతిన్న కీర్తి సురేష్ ను భర్త లింగా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కొన్నేళ్ళ తర్వాత అంత తెలుసుకొని కీర్తి సురేష్ ని అర్థం చేసుకున్న రంగ రాజు అనే వ్యక్తి పెళ్లి చేసుకోవటం జరుగుతుంది. తరువాత గర్భందాల్చి ప్రసవం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ అప్పటికీ తన కొడుకు కనిపించకుండా ఆరు సంవత్సరాలు గడిచిన గాని కీర్తి సురేష్ ని…కనిపించకుండా పోయిన కొడుకు యొక్క జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. దీంతో కొడుకు అజయ్ కోసం కీర్తి సురేష్ వెతుకుతుండగా అనూహ్యంగా అడవిలో దొరుకుతాడు. కానీ తన కొడుకు ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. దీంతో వెంటనే కీర్తి సురేష్ డాక్టర్ డేవిడ్ ని సంప్రదిస్తుంది. అయితే ఆ పిల్లవాడు యొక్క మనస్తత్వం అంతా పరిశీలించి…డాక్టర్ దీని వెనకాల పిల్లలను ఎత్తుకెళ్లే ఓ సైకో ఉంటాడని షాకింగ్ విషయం బయట పేడతారు. దీంతో కీర్తిసురేష్ ఒంటరిగా వేట మొదలు పెట్టి ఈ విషయాన్ని ఎలా బయటపెట్టింది అనేది చాలా సస్పెన్స్ థ్రిల్లర్ గా డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ అద్భుతంగా చూపించాడు.

విశ్లేషణ..!!

డైరెక్టర్ ఎక్కువగా కీర్తి సురేష్ క్యారెక్టర్ పైన పెట్టడంతో మిగతా క్యారెక్టర్లు డల్ అయిపోయాయి. స్టోరీ బేసిక్ పాయింట్ బాగున్నా గాని స్క్రీన్ ప్లే అంత ఎఫెక్టివ్ గా కనిపించకపోవడంతో సినిమాకి మరో మైనస్. ఇక సినిమా లో లింగ, అద్వైత్, హరిణి, నిత్య తదితరులు తమ పాత్రలకు న్యాయం బాగానే చేశారు. మొత్తంమీద చూసుకుంటే పెంగ్విన్ సినిమాలో కీర్తి సురేష్ నటన తప్ప… పెద్దగా ఆకట్టుకునే సన్నివేశాలు ఏమీ లేవని టాక్. అదేవిధంగా భావోద్వేగాలు కూడా సరైన రీతిలో డైరెక్టర్ చూపించలేక పోయినట్లు టాక్. థ్రిల్లర్ సినిమా కు బలమైన ఫ్లాష్ లేకపోవటం మైనస్. అలాగే విలన్ పాత్ర గొప్పగా ఎస్టాబ్లిష్ చేసి ఆ పాత్రను రివిల్ చేసిన తరువాత ఆ రేంజ్ ఇంపాక్ట్ కలిగించడంలో పూర్తిగా సినిమా యూనిట్ ఫెయిల్ అయిందని సినిమా చూసి చెప్పవచ్చు. దాంతో సినిమా నాసిరకంగా మారిపోయింది. సైకో కిల్లర్ మూవీస్ లో ఏదో ప్రత్యేకమైన డిఫరెంట్ సినిమా అని చెప్పే కంటెంట్ పెద్దగా ఏమీ లేదు. దీంతో మస్ట్ వాచ్ కాకుండా జస్ట్ వాచ్ అనే కేటగిరిలో పెంగ్విన్ సినిమాని చూడవచ్చు.

పూర్తి రిజల్ట్ :

‘పెంగ్విన్’ సినిమా మొత్తం కీర్తి సురేష్ చుట్టూ కథ నడవడంతో ఆమె యాక్టింగ్ అదుర్స్ అని చెప్పవచ్చు. మహానటి వంటి సినిమాతో ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న కీర్తిసురేష్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమాలో తన హండ్రెడ్ పర్సెంట్ నటనతో వన్ మాన్ ఆర్మీగా సినిమాకి మంచి హైప్ తెచ్చింది. కానీ మిగతా నటీనటుల పై స్టోరీ పై పెద్దగా డైరెక్టర్ శ్రద్ధ పెట్టలేకపోవడం తో… పెంగ్విన్ థ్రిల్లర్ తరహాలో పెద్దగా ఆకట్టుకునే సన్నివేశాలు డైరెక్టర్ చూపించలేక పోయినట్లు టాక్. సినిమాని కీర్తి సురేష్ నటన కోసం చూడవచ్చు.