కరోనా నుంచి రక్షణ కోసం పుతిన్ కు భారీ క‌వ‌చం

వాస్తవం ప్రతినిధి: రష్యాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వైరస్‌ బారీన పడకుండా ఉండేందుకు ప్రత్యేకమైన డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ నిర్మించుకున్న‌ట్లు తెలుస్తోంది. మాస్కోలోని త‌న నివాసంలో డిస్ ఇన్‌ఫెక్ష‌న్ ట‌న్నెల్ నిర్మించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న్ను ఎవ‌రు విజిట్ చేయాల‌నుకున్నా.. వారు ఆ ట‌న్నెల్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ర‌ష్యాలోని పెంజా ప‌ట్ట‌ణానికి చెందిన ఓ కంపెనీ ఆ ట‌న్నెల్‌ను త‌యారు చేసింది. పుతిన్‌ను కలవడానికి వచ్చే సందర్శకులు ప్రత్యేక సొరంగ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాల్సి ఉంటుందని తెలిపారు. దాని నుంచి వెళ్లే వాళ్ల‌కు క్రిమిసంహార‌కం స్ప్రే చేస్తారు. సీలింగ్ నుంచి, ప‌క్క‌ల నుంచి ఆ స్ప్రే .. విజిట‌ర్స్‌ను శానిటైజ్ చేస్తుంది. రష్యాలో ఇప్ప‌టి వ‌ర‌కు 5,29,000 కేసులు న‌మోదు అయ్యాయి. పాజిటివ్ కేసుల్లో.. ప్ర‌పంచంలో మూడ‌వ స్థానం ర‌ష్యాదే.