బాలయ్య బోయపాటి సినిమాలో మరో యంగ్ హీరో..??

వాస్తవం సినిమా: ‘సింహ’ మరియు ‘లెజెండ్’ తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు మూడో సినిమా చేస్తున్నాడు. ఇటీవల బాలయ్య బాబు చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న తరుణంలో ఈ సినిమాతో బోయపాటి హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య బాబు విజయం సాధించాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన చిన్నపాటి వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుని సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ‘అందాల రాక్షసి’ నటుడు యంగ్ హీరో నవీన్ చంద్ర ఒక కీలకమైన క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. గతంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’ విలన్ పాత్ర చేసిన నవీన్ చంద్ర ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

దీంతో ఇప్పుడు బాలయ్య బాబు సినిమాలో మరో చాన్స్ కొట్టడంతో….. నవీన్ చంద్ర సినిమా లో ఉన్నాడు అని వచ్చిన వార్త కి నందమూరి అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా కూడా నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ త్వరలో మొదలు పెట్టనున్నారు బోయపాటి.