యూకేలో కనిపెట్టిన కరోనా డ్రగ్..!!

వాస్తవం ప్రతినిధి: డిక్సమేతసీన్ అనే స్టెరాయిడ్ కరోనా వ్యాధిగ్రస్తులకు బాగా పనిచేస్తుందని పరిశోధనలో తేలినట్లు యూకే వైద్యులు ప్రకటించారు. వైరస్ బారిన పడిన వారు ఆక్సిజన్ మరియు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న వారికి ఈ మందును ఆరు మిల్లీగ్రాములు… పది రోజుల పాటు వ్యాధిగ్రస్తులకు ఇస్తే మరణం నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఈ మందు అందరికీ అందుబాటులో తీసుకురావటానికి అన్ని దేశాల ప్రభుత్వాల నాయకులు చొరవ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఎక్కువగా వైరస్ ప్రభావం ప్రస్తుతం బాగా పెరుగుతున్న తరుణంలో… ఎలాగైనా ఈ డ్రగ్ ఇండియాకి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. మరోపక్క ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కి విరుగుడు యూకే వైద్యులు మందు కనిపెట్టడంతో సోషల్ మీడియాలో వాళ్లపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.