ఇంత జరుగుతున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? : రాహుల్ గాంధీ

వాస్తవం ప్రతినిధి: భారత్ పై చైనా డ్రాగన్ నిప్పులు కక్కుతున్నా చడీచప్పుడు లేదు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.? మన సైనికులను చంపుతున్నా.. మన భూమిని చైనా ఆక్రమిస్తున్నా ఎందుకు చోద్యం చూస్తున్నారని ప్రధాని మొదీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు. సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తలపై ప్రధాని మోడీనోరు విప్పాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో దాదాపు 20 మంది భారత సైనికులను చైనా చంపినా ప్రధాని నరేంద్రమోడీ నోట వెంట స్పందన రాదా అంటూ ప్రశ్నించారు. బుధవారం ట్విట్టర్ ద్వారా ఆయన పలు ప్రశ్నలు సందించారు. ఇలాంటి సమయంలో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. చైనా సైన్యం మన భూ భాగాన్ని ఎలా ఆక్రమించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలని, అసలు వాస్తవంగా ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మన సైనికులను చంపే సాహసం చైనా ఎలా చేసిందని ప్రశ్నించారు.