ఎదురు కాల్పులు..ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు!

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్‌లో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా ముష్కరుల ఏరివేత కార్యక్రమం చేపట్టిన భద్రతా బలగాలు అనువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

జమ్ముకశ్మీర్ షోపియన్ జిల్లాలో ఇవాళ ఉదయం పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారు. తుర్క్‌ వాంగమ్ ప్రాంతలో నిర్భంద తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులు చేశాయి. కాగా మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో భారత్ బలగాలు అక్కడ కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది.