అమెరికాలో అరుదైన ఘనత సాధించిన ఎన్నారై మహిళ

వాస్తవం ప్రతినిధి: భారత సంతతికి చెందిన అన్‌మోల్‌ నారంగ్‌ అరుదైన ఘనత సాధించింది. వెస్ట్‌పాయింట్‌లోని మిలటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తొలి సిక్కు యువతిగా చరిత్ర సృష్టించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో ఇప్పుడు ఓక్లహామాలో బేసిక్‌ ఆఫీసర్‌ లీడర్‌షిప్‌ కోర్సు అభ్యసించనుంది. తరువాత 2021 లో జపాన్‌లోని ఒకినావాలో అమెకు పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం ఉంది. నారంగ్‌ జార్జియాలోని రోస్‌వెల్‌లో వలస దంపతులకు జన్మించారు. అక్కడే పెరిగారు. భారత ఆర్మీలో సేవలందించిన ఆమె తాతయ్య స్ఫూర్తితోనే సైన్యంలో సేవలు అందించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.