‘సర్కారీ వారి పాట’ సినిమాకు పరశురాం రెమ్యూనరేషన్..??

వాస్తవం సినిమా: పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘సర్కార్ వారి పాట’. గత నెల సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది స్టార్టింగ్ లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ఈ సినిమాతో మరో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం డైరెక్టర్ పరుశురాం ఏకంగా 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు సినిమాకు వచ్చే లాభాల్లో 20% షేర్ కూడా తీసుకుంటున్నాడని, ఇందులో భాగంగానే ముందుగానే నిర్మాతల నుంచి 4 కోట్లు అడ్వాన్స్ అందుకోబోతున్నాడని, సినిమా విడుదలైన తర్వాత మిగిలిన పారితోషికంతో పాటు లాభాలు కూడా ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.