మరోసారి సోషల్ మీడియాలో సత్తాచాటిన అల్లు అర్జున్..!!

వాస్తవం సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. బన్నీ నటించిన సినిమాలకు యూట్యూబ్ లో ప్రేక్షకులు ఏ విధంగా బ్రహ్మరథం పడతారో అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అల వైకుంఠపురం లో’ సినిమా పాటలు సోషల్ మీడియాలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో తన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అల్లు అర్జున్ రుజువు చేసుకున్నాడు. తాజాగా బన్నీ పేస్ బుక్ ఫాలోవర్స్ మరియు అతని పేజ్ లైక్స్ 13 మిలియన్ మార్క్ ను టచ్ చేసింది. ఈ రికార్డు నమోదు చేసిన మొట్టమొదటి దక్షిణ భారత హీరోగా నిలిచాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే సినిమాలో నటిస్తున్నాడు.