ఎవరికీ అర్థం కాని వైసీపీ ఎంపీ..??

వాస్తవం ప్రతినిధి: వైసీపీ పార్టీ నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు వైఖరి ఎవరికి అర్థం కావటం లేదు. మొన్నటి వరకు బహిరంగంగా మీడియా ముందు వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. మొదటి నుండి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పార్టీలో మరియు ఏపీ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల జగన్ ఏడాది పరిపాలన విషయంలో విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇసుక విషయంలో చాలా దారుణంగా ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. మరి ఏమైందో ఏమో తెలియదు గాని కొద్ది రోజులలోనే వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలను తెగ పొగుడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య పరిష్కారానికి సీఎం జగన్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ది బెస్ట్ నిర్ణయాలని, గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్‌చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి జనం జేజేలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఇసుక వ్యవహారంలో అవకతవకలు జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వటం ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు.