వాయిదాల పద్దతిలో విద్యుత్ బిల్లు చెల్లింపులు?

వాస్తవం ప్రతినిధి: లాక్ డౌన్ నేపథ్యంలో భారీగా వస్తున్న కరెంటు బిల్లుల్ని చెల్లించేందుకు వాయిదా పద్దతుల్ని తీసుకురావాలంటూ తాజాగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తమకు రెగ్యులర్ గా వచ్చే బిల్లులతో పోలిస్తే.. ఎక్కువ మొత్తంలో వస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
దీంతో.. ఆ మొత్తాన్ని కట్టలేని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. వేసవిలో కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఈసారి లాక్ డౌన్ కావటం.. ఇంట్లో నుంచి బయటకు కదలకపోవటంతో కరెంటు వినియోగం ఎక్కువగా ఉంది.

దీనికి తోడు.. మూడు నెలల సరాసరిని తీసి బిల్లులు వేయటం కూడా.. బిల్లుమొత్తం కొంత పెరగటానికి కారణంగా భావిస్తున్నారు. దీంతో..బిల్లు చెల్లింపులకు పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్నీ పరిగణనలోకి తీసుకొన్న తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ. రూల్ ను మార్చే అవకాశం తమకు లేని నేపథ్యంలో.. లాక్ డౌన్ తర్వాత మూడు నెలల బిల్లులు భారీగా రావటంతో.. ఆ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పించే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

దీని ప్రకారం.. బకాయి మీద 1.5శాతం వడ్డీతో కలిసి.. వాయిదాల రూపంలో బిల్లు చెల్లించే వీలుందని చెబుతున్నారు. అయితే.. ఎన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది? దాని విధివిధానాలు ఏమిటనన విషయంపై స్పష్టమైన ప్రకటన ఇంకా వెలువడలేదు.