మదురై బాలికకు దక్కిన ఐరాస గౌరవం!

వాస్తవం ప్రతినిధి: లాక్‌డౌన్‌ వేళ నిరుపేదలకు ఆహారం అందించడానికి తన చదువు కోసం పొదుపు చేసిన రూ.5లక్షలను తండ్రితో ఖర్చు చేయించిన మదురై బాలికకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను ‘గుడ్‌విల్‌ అంబాసిడర్‌ ఫర్‌ ది పూర్’‌ గా ఐక్యరాజ్యసమితి నియమించింది. మదురైలో సెలూన్‌ షాప్‌ నడుపుతున్న మోహన్‌ కుమార్తె నేత్ర 9వ తరగతి చదువుతోంది. ఆమె పై చదువుల కోసం మోహన్‌ రూ.5లక్షల వరకు పొదుపు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆహారం కోసం నిరుపేదలు పడుతున్న అవస్థలు చూసి ఆ బాలిక చలించిపోయింది. తన చదువు కోసం దాచిన సొమ్ముతో వారికి బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేయాలని తండ్రిని కోరింది. దీనిపై సమగ్ర సమాచారం సేకరించిన ఐక్యరాజ్యసమితి ఆమెను ‘గుడ్‌విల్‌ అంబాసిడర్‌ ఫర్‌ ది పూర్’ గా నియమించింది.