కరోనా తో భారత మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు మృతి

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ మహమ్మారితో భారత మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు ఇలైదత్ హంజా కోయా మృతిచెందారు. కరోనా వైరస్ లక్షణాలతో కేరళలోని మల్లాపురంలో ఉన్న మంజేరి వైద్యకళాశాలలో మే 26 నుంచి చికిత్స పొందుతున్నారు. శ్వాస సమస్య తీవ్రమవడంతో ఆయన ఈ రోజు ఉదయం 6:30 గంటలకు తుది శ్వాస విడిచారు. దీంతో కేరళలో కరోనా మృతుల సంఖ్య 15కు చేరింది.