అసలు అలాంటి ఆలోచనే జట్టు సభ్యుల్లో లేదట..!

వాస్తవం ప్రతినిధి: 2018-19 సీజన్‌లో విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. ఆ సమయంలో ఆసీస్‌ ఆటగాళ్లు కోహ్లీని కవ్వించకుండా మర్యాదగా చూసుకున్నారు. అయితే, ఇదంతా ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ల కోసమే అని గతంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ ‌ఆరోపించాడు.

తాజాగా దీనిపై స్పందించారు ఆసీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఫించ్‌. ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ల కోసం స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాం అనడం సబబు కాదని, జట్టులో ఏ ఆటగాడిని అడిగిన ఈ విషయం స్పష్టమవుతుందని తెలిపాడు. ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ల కోసమే కోహ్లీని కవ్వంచడం లేదన్న‌ క్లార్క్‌ మాటలను ఫించ్‌ తప్పుబట్టాడు. అసలు అలాంటి ఆలోచనే జట్టు సభ్యుల్లో లేదని తేల్చి చెప్పాడు.