ఘీంకరిస్తూ రోడ్డుకు అడ్డంగా నిలబడ్డ గజరాజులు!

వాస్తవం ప్రతినిధి: లాక్ డౌన్ నేపధ్యంలో జన సంచారం లేకపోవడంతో తిరుమలలో వన్యప్రాణుల సంచారం పెరుగుతోంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఎనుగుల మంద హల్చల్ చేసింది. సుమారు ఏడు ఏనుగులు గుంపుగా రొడ్డు మీదకు వచ్చాయి. ఇవి రహదారిపై గుంపుగా చేరడంతో వాహనదారులు భయబ్రాంతులకు గురై ఎక్కడికక్కడే వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఏనుగుల గుంపు ఘీంకరిస్తూ పక్కకు వెళ్లడంతో తిరిగి వాహనాలు ముందుకు కదిలాయి. కాగా, నాలుగు రోజుల కిందట కూడా ఇలాగే ఈ ఏనుగుల గుంపు వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశాయని అధికారులు తెలిపారు.