భాగ్యనగరంలో భారీగా పెరిగిన కంటైన్మెంట్ జోన్లు

వాస్తవం ప్రతినిధి: గ్రేట‌ర్ ప‌రిధిలో ప్ర‌తి రోజు దాదాపు వంద క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ స‌డ‌లింపులు వ‌చ్చిన నాటి నుండి ప్ర‌తి రోజు 50కి పైగా కేసులు వ‌స్తుండ‌గా… తాజాగా కేసుల సంఖ్య దాటింది. దీంతో న‌గ‌రంలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది.

గ్రేట‌ర్ లో లాక్ డౌన్ నుండి భారీ మిన‌హాయింపులు ఇచ్చే నాటికి కేవ‌లం మూడు, నాలుగు జోన్ల‌కే క‌రోనా కేసులు ప‌రిమితం అయ్యాయి. కానీ జూన్ 3 వ‌ర‌కు గ్రేట‌ర్ లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 159కి చేరింది. న‌గ‌రం ప్ర‌తి మూల‌న కేసులు న‌మోద‌వుతున్న‌ట్లు లిస్ట్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో క‌రోనా విశ్వ‌రూపం చూడాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని… అసలైన విపత్తుకు గ్రేట‌ర్ చేరువ‌య్యింద‌ని హెచ్చ‌రిస్తున్నారు.