శ‌భాష్ జ‌గ‌న్..!

వాస్తవం ప్రతినిధి: క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌క‌టించిన ఆత్మ నిర్భ‌ర్ భార‌త్‌, గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న మిన‌హా మిగిలిన అన్ని ప‌థ‌కాలూ ఆగిపోనున్నాయి. ఈ కీల‌క స‌మాచారాన్ని కేంద్ర ఆర్థిక‌శాఖ వెల్ల‌డించింది. బడ్జెట్లో ప్రకటించిన పథకాల అమలును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు శుక్రవారం వివిధ శాఖలకు పంపిన స‌ర్క్యుల‌ర్‌లో కేంద్రం తెలిపింది.

అయితే, కేంద్ర ప్ర‌భుత్వంతో పోలిస్తే ఏపీ సీఎం జ‌గ‌న్ నే బెటర్ అంటున్నారు కొందరు. ఎందుకంటే..? ఒక వైపు క‌రోనా విప‌త్తు, మ‌రోవైపు లోటు బ‌డ్జెట్ ఉన్న‌ప్ప‌టికీ.. తానిచ్చిన మాట ప్ర‌కారం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ శ‌భాష్  అనిపించుకుంటున్నారు జ‌గ‌న్. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో జ‌గ‌న్ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. అంతేకాదు, క‌రోనా విప‌త్తుతో సంబంధం లేకుండా, ఇంత క‌ష్ట‌కాలంలోనూ జ‌గన్ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుండ‌డం ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. క‌రోనా విప‌త్తులోను వాహ‌న‌మిత్ర ప‌థ‌కం కింద డ్రైవ‌ర్ల‌కు రూ.10 వేలు చొప్పున వాళ్ల ఖాతాల్లో జ‌మ చేసి ఒక్కసారిగా అందరీ షాక్ ఇచ్చారు. దీంతో ఏపీ సీఎం జ‌గ‌న్ గ్రేట్ అని వైసిపి శ్రేణులు పోగడ్తల వర్షం కురిపిస్తున్నారు.