హిందూ దేవాల‌యాలపై మెగా బ్రదర్ ట్వీట్…సంచలనం!

వాస్తవం ప్రతినిధి: ఏపీ రాజకీయలపై నే కాకుండా ఏదో ఒక ట్వీట్ పెడుతూ ఏదొక సంచలనం రేపుతూనే ఉన్నారు మెగా బ్రదర్ నాగబాబు. అలా కొన్ని రోజుల కితం గాడ్సే విషయంలో ట్వీట్ చేసిన విషయం, నంద‌మూరి బాల‌య్య క్ష‌మాప‌ణ చెప్పాలని చేసిన ట్వీట్ పవన్ వరకు వెళ్లి ఆగ్రహాన్ని తెప్పించింది. దానితో నాగబాబు వ్యక్తిగత అభిప్రాయాలకు తన పార్టీకు సంబంధం లేదని తెలిపారు. అలాగే తాజాగా ఇప్పుడు మ‌రో ట్వీట్ చేశారు. ఈ సారి హిందూ దేవాల‌యాల గురించి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హిందూ దేవాల‌యాల్లో రాజ‌కీయ జోక్యం ఉండ‌కూడద‌ని… రాష్ట్ర ప్ర‌భుత్వంకు గానీ, కేంద్రానికి గానీ సంబంధం లేకుండా ఆల‌యాలు ఉంటే చూడాల‌ని ఉంది అంటూ నాగ‌బాబు ట్వీట్ చేశారు. జీవితాల్ని హిందు ధర్మం కోసం త్యాగం చేసిన చాగంటి కోటేశ్వర రావు గారు,గరికపాటి నరసింహ రావు గారు,గీత గంగాధర్ గారు,సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి ఇంకా ఎందరో గొప్ప వ్యక్తుల్ని హిందు దేవాలయాలను నిర్వహించే స్థానం లో చూడాలని ఉంది అని కామెంట్ చేశారు.

బీజేపీ ఎంపీ స‌త్యపాల్ ఓ ఇంగ్లీష్ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో హిందూ దేవాల‌యాలు రాష్ట్ర ప్ర‌భుత్వాల చేతిలో ఉండ‌కూడదంటూ వ్యాఖ్య‌లు చేశారు. దాన్ని కోట్ చేసిన నాగ‌బాబు… రాజ‌కీయ జోక్యం లేని హిందూ దేవాల‌యాల పాల‌న సాగాల‌ని కోరుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.