కువైట్‌లోని భార‌తీయ ప్ర‌వాసుల‌కు ఆహార పంపిణీ చేసిన భార‌త రాయ‌బారి

వాస్తవం ప్రతినిధి: భార‌తీయ ప్ర‌వాసుల‌కు సాయం చేసేందుకు ఏర్పాటైన ఇండియ‌న్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్‌ ఆధ్వ‌ర్యంలో కువైట్‌లోని జ్లీబ్ షుయూక్‌లో జ‌రిగిన ఆహార పంపిణీ కార్య‌క్ర‌మంలో భార‌త రాయ‌బారి జీవ సాగ‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జీవ సాగ‌ర్ మాట్లాడుతూ ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్‌ ఎంతో నియ‌బ‌ద్ధ‌తో కువైట్‌లోని భార‌త స‌మాజానికి స‌హాయం చేస్తోంద‌ని అన్నారు. క‌రోనా నేప‌థ్యంలో క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న భార‌త స‌మాజానికి క‌నీస సాయం అందించేందుకు భార‌త రాయ‌బార కార్యాల‌యం 14 మంది స‌భ్యుల‌తో కూడిన ఐసీఎస్‌జీ బృందాన్ని ఏర్పాటు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయన గుర్తు చేశారు.