భారత సంతతి యుకే మంత్రి అలోక్ శర్మకు కరోనా..?

వాస్తవం ప్రతినిధి: యూకేలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యక్తి అలోక్ శర్మ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ కొంచెం అస్వస్ధతకు గురయ్యారు. దీంతో కరోనా సోకిందేమోనన్న అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ అలోక్ శర్మకు కరోనా సోకితే.. బుధవారం పార్లమెంట్‌లో ఆయనకు 2 మీటర్ల దూరంలో ఉన్న వారంతా రెండు వారాల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. పార్లమెంట్‌‌లో అలోక్ శర్మకు లేబర్ పార్టీకి చెందిన ఎడ్ మిలిబాండ్ గ్లాసుతో నీళ్లు అందించినట్టు తెలుస్తోంది. అలోక్ శర్మకు కరోనా పాజిటివ్ వస్తే ఎడ్ మిలిబాండ్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశముంది.