విరాట్ ఆడిన విధంగా రోహిత్ బ్యాటింగ్ చేయలేడట..!

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ పలు ఆసక్తి కర విషయాలు బయటపెట్టారు. విరాట్‌ని, రోహిత్‌ని పోల్చలేమని, ఎందుకంటే వారిద్దరి పాత్రలు వేరు. కొత్త బంతి బౌలర్ల బౌలింగ్‌లో పవర్‌ప్లేలో దూకుడుగా ఆడటం రోహిత్ పాత్ర. అయితే, మ్యాచ్ ఆసాంతం నిలబడి మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించడమే కోహ్లీ పాత్ర అని హాగ్ తెలిపారు. భారీ స్కోర్‌ల ఛేజింగ్‌లో విరాట్ ఆడిన విధంగా రోహిత్ బ్యాటింగ్ చేయలేడని ఆయన అభిప్రాయపడ్డారు.