అసలు ఎవరైనా ఇలా చేయాలని ఎందుకు అనుకుంటారో..?

వాస్తవం ప్రతినిధి: కేరళలోని మలప్పురం జిల్లాలో గర్భంతో ఉన్న ఏనుగును పైనాపిల్ బాంబుతో చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనకు కారకులైన ప్రతీ ఒక్కరిని కఠింగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ దుర్ఘటనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, జంతు ప్రేమికుడు అయిన కెప్టెన్ పీటర్‌సన్ స్పందిస్తూ.. ఏనుగు మృతి చెందిన ఫొటోలు చూస్తుంటే ఎంతో ఆవేదన కలిగిందని, అసలు ఎవరైనా ఇలా చేయాలని ఎందుకు అనుకుంటారో..? ఎందుకు?” అంటూ కెవిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.