చిక్కుల్లో పడ్డా టీం‌ఇండియా మాజీ ఆటగాడు..!

వాస్తవం ప్రతినిధి: టీం‌ఇండియా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డాడు. యువరాజ్ సింగ్‌పై దళిత హక్కుల సంఘం నేత రజత్ కల్సన్ పోలీసులు కేసు పెట్టారు. ఇటీవల రోహిత్ శర్మ‌తో కలిసి నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో యువరాజ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీం ఇండియా యువ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్‌‌ను ‘భాంగీ’ అని యువరాజ్ అన్నాడు. దీంతో యువరాజ్‌పై సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. యువరాజ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. భారత స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌పై ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో కులపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ దళిత హక్కుల నేత రజత్‌ కల్సన్‌ హర్యానాలోని హన్సీ పోలీస్‌ స్టేషన్‌లో యువీపై ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని రజత్‌ డిమాండ్‌ చేశారు. యువరాజ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని.. ఇందుకు సంబంధించిన సీడీలు, పత్రాలు పోలీసులకు అందజేశామని రజత్‌ కల్సన్‌ తెలిపారు.