గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ !

వాస్తవం ప్రతినిధి: గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికల ముందు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.   . ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం తమ పదవులకు రాజీనామా చేయగా.. స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించారు.దీంతో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లను కోల్పోయినట్టయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జితు చౌదరిలు బుధవారం శాసనసభ స్పీకర్ త్రివేదిని కలిసి రాజీనామాలు సమర్పించారు. ఈ క్రమంలో గురువారం వారి రాజీనామాలను ఆమోదించినట్లు స్పీకర్ త్రివేది ప్రకటించారు. ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. కాగా అక్షయ్ పటేల్ వడోదర లోని కర్జన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించగా, చౌదరి వల్సాద్ కప్రాడా సీటు నుండి గెలిచారు.