తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ డౌన్..!!

వాస్తవం ప్రతినిధి: 2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే అదేవిధంగా చీరాల ఎమ్మెల్యే వైసిపి పార్టీ కి జై కొట్టగా మహానాడు జరిగిన టైములో మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుండి జంప్ అవడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు రావడం జరిగాయి.

ఇదిలా ఉండగా తాజాగా టీడీపీ పార్టీలో మరో వికెట్ డౌన్ అయ్యింది. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు ఎ.ఎస్.మనోహర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలం ఏ పార్టీలో చేరనని, ఆ తర్వాత తాను ఏ పార్టీలో చేరేది చెబుతానని ఆయన అన్నారు. మనోహన్ గతంలో సుదీర్ఘకాలం టీడీపీ లో ఉన్నారు. చిత్తూరు మున్సిపల్ చైర్మన్ గాను, ఆ తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగాను గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పుడు టిక్కెట్ రాలేదు. ఆ తర్వాత ఆయన టిడిపిలో చేరారు.గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. తాజాగా ఆయన పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించినట్లు సమాచారం.