వ్యాపార రంగంలో అడుగు పెట్టబోతున్న మంచు మనోజ్..??

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వ్యాపారరంగంలో దూసుకుపోతున్నారు. మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ల వ్యాపారంలో రాణిస్తుంటే మరో పక్క రామ్ చరణ్ నిర్మాతగా సక్సెస్ సాధిస్తున్నారు. మరికొంత మంది హీరోలు కూడా వ్యాపారాలు చేస్తూనే మరోపక్క సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంచు హీరో మంచు మనోజ్ వ్యాపార రంగంలో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. అదే గేమింగ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోన్. ఓ విశాలమైన స్థలంలో రకరకాల ఎంటర్ టైన్ మెంట్లు, గేమింగ్ లు, ఇతరత్రా వ్యవహారాలను సెటప్ చేస్తూ ఓ ఫన్ జోన్ ను క్రియేట్ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఎకరం స్థలం కావటంతో మంచు మనోజ్ వెతుకులాటలో ఉన్నాడు. ఇదే టైం లో 2017 సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ ఇచ్చి సొంత బ్యానర్ లో ‘అహంబ్రహ్మాస్మి’ అనే భారీ బడ్జెట్ సినిమా కూడా చేస్తున్నాడు మంచు మనోజ్.