బౌలర్లను జాగ్రత్తగా చూసుకోవాలి: ఇర్ఫాన్‌ పఠాన్‌

వాస్తవం ప్రతినిధి: క్రీడా శిక్షణ తిరిగి ప్రారంభమైతే.. బౌలర్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని భారత మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయ పడ్డాడు. దేశంలో ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లు తిరిగి ప్రాక్టీస్‌ వైపు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే క్రికెటర్లు కూడా ప్రాక్టీస్‌ మొదలెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ మాట్లాడుతూ.. ‘రెండు నెలలకు పైగా ఆటగాళ్లు ప్రాక్టీస్‌ నుంచి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మైదానంలో అడుగుపెడితే గాయాల బెడద ఎక్కువ ఉంటుంది. అందుకే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా పేస్‌ బౌలర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం’ అని అన్నాడు.