వలస కూలీల కు దేవుడు అయిపోయాడు సోనుసూద్..!!

వాస్తవం సినిమా: కరోనా వైరస్ ఎఫెక్ట్ కి ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి దేశవ్యాప్తంగా ఎక్కువగా ఇబ్బందులు పడింది వలస కూలీలు. అటువంటి వలస కూలీల కు ఎక్కువగా సాయం చేసింది దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సోనూసూద్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సోనూసూద్ కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలసకూలీ లకు మొదటి లో బస్సులు పెట్టాడు తర్వాత విమానం పెట్టి కొంత మందిని గమ్యస్థానాలకు చేర్చాడు. అయితే ఇటీవల వలస కూలీల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో వాటికి ఫోన్ కాల్స్ ఎక్కువగా రావడంతో వాళ్ల బాధను తీర్చడం కోసం ఏకంగా మూడు ట్రైన్ లను బుక్ చేశాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సోనూసూద్ ఏమన్నారంటే.. మొదటిసారి బస్సులను ఏర్పాటు చేసి కొంతమంది కూలీలను ముంబై నుంచి కర్ణాటకకు పంపించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఫోన్‌ కాల్స్‌ ఎక్కువయ్యాయని అన్నారు సోనూసూద్. గ్యాప్‌ లేకుండా కాల్స్‌ వస్తుండటంతో కొన్నిసార్లు కొందరు చేసిన కాల్స్‌‌, మెస్సేజ్‌లను మిస్సయ్యానన్నారు. అందుకోసమే ఇటీవల ఓ టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. బస్సుల్లో వలస కార్మికులను పంపించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావటం కొంత ఆలస్యం అవుతున్నదని… అందుకే మూడు రైళ్లను బుక్ చేసినట్లుగా తెలిపారు. అయితే ఈ మహత్తర కార్యంలో తనకు సహకరిస్తున్నవారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సోనూసూద్.