‘RRR’ సినిమాటోగ్రాఫర్ అదిరిపోయే వార్త చెప్పాడు..!!

వాస్తవం సినిమా: డైరెక్టర్ రాజమౌళి తీసిన ప్రతి సినిమాకి  సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ పని చేయడం జరిగింది. ప్రస్తుతం బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ పని చేస్తున్నారు.

తాజాగా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సెంథిల్ కుమార్ ‘RRR’ సినిమా గురించి అదిరిపోయే వార్త చెప్పాడు. అదేమిటంటే ఈ సినిమా షూటింగులో తనకున్న అతి పెద్ద చాలెంజ్ గురించి వివరించారు. ఆయన ఏమన్నారంటే చాలామందికి స్వాతంత్య్రానికి  పూర్వం దేశం ఎలా ఉండేదో అంతా తెలుసు. కానీ ఆ విషయంలో దానిని డైరెక్టర్ శైలికి అనుగుణంగా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడం అనేది నాకు ఈ సినిమాలో అతి పెద్ద చాలెంజ్ గా మారింది అని తెలిపారు.

అంతేకాకుండా బాహుబలి కంటే RRR కాస్త విభిన్నం. బాహుబలి కల్పితమైతే.. RRR స్వాతంత్రం రాక ముందు కాలానికి సంబంధించిన స్టోరీ’. కాబట్టి.. వారి ఊహకు తగిన విధంగా ఉండాలి. అలాగే ఈ చిత్రంలో ఫ్యాన్స్.. తమ హీరోల అద్భుతమైన నటనను చూస్తారని అన్నారు సెంథిల్.