ఆ వార్తల్లో నిజం లేదు అంటున్న సీనియర్ హీరోయిన్ సిమ్రాన్..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో సిమ్రాన్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. 1997లో విఐపి సినిమాతో తమిళ సినిమా రంగంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన నటి ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. అదే ఏడాది తెలుగు సినిమా రంగంలో ‘అబ్బాయిగారి పెళ్లి’ సినిమా తో తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌బాబుతో నటించడం జరిగింది.

అటువంటిది కొన్నాళ్ల నుండి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిమ్రాన్ ఇటీవల చంద్రముఖి సీక్వెల్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. చంద్రముఖి 2 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సినిమా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు ఇటీవల రావడం జరిగాయి. అయితే వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఇలాంటి వార్తలు రాసేవారు నిజం తెలుసుకొని రాయాలని క్లారిటీ ఇచ్చింది. ‘చంద్రముఖి’ సినిమా 2005వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. రజినీకాంత్ మరియు జ్యోతిక నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాకి సీక్వెల్ వస్తున్నట్లు వార్తలు రావడంతో సినిమాలో సిమ్రాన్ నటిస్తున్నట్లు వార్తలు ఇటీవల పుట్టుకొచ్చాయి. దీంతో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అవన్నీ పుకార్లే అంటూ సిమ్రాన్ తేల్చిచెప్పింది.