డైరెక్టర్ తేజ సినిమాకి నో చెప్పిన సాయి పల్లవి..??

వాస్తవం సినిమా: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది సాయి పల్లవి. మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత అనేక అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది. అటువంటిది ఇటీవల డైరెక్టర్ తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తీయబోతున్న అలిమేలు (సమేత) వెంకటరమణ సినిమా కోసం సాయి పల్లవి ని హీరోయిన్ గా చేయమని అడిగినట్లు తెలుస్తోంది. దానికి సాయి పల్లవి నో చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కారణం చూస్తే తనకంటే గోపిచేంద్ చాలా పెద్దగా ఉండటం వల్ల సాయి పల్లవి తేజ సినిమాకి నో చెప్పినట్లు ఫిలిం నగర్ టాక్. స్టోరీ వినకుండానే సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.