‘సర్కారు వారి పాట’ సినిమా స్టోరీలైన్..??

వాస్తవం సినిమా: మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు మే 31వ తారీఖున తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ అని టైటిల్ ఎనౌన్స్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ లో మహేష్ చాలా మాసివ్ గా జుట్టు పెంచుకుని గతంలో ఎన్నడూ లేనివిధంగా చెవిపోగు తో పాటు మెడ మీద రూపాయి టాటూ వేయించుకోవటం జరిగింది. దీంతో సినిమాపై అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా ఆసక్తి పెరిగింది. సినిమా స్టోరీ ఎలా ఉంటుంది డైరెక్టర్ పరుశురాం మొదటిలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడని చెప్పి మహేష్ ని ఈ విధంగా చాలా మాస్ లుక్ లో చూపించడం ఏంటి అని అభిమానులు తెగ మదన పడుతున్నారు. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ‘సర్కారు వారి పాట’ సినిమా స్టోరీలైన్ ఇదే అంటూ వైరల్ అవుతోంది. సినిమాలో మహేష్ బాబు అప్పుల అప్పారావు లో కనిపిస్తాడట. విదేశీ రాష్ట్రం లో ఉంటూ అక్కడి వారికి అప్పులిచే వాడిగా మహేష్ బాబు కనిపించనున్నారట. అయితే మహేష్ అప్పులు ఇచ్చే టపుడు, తీసుకునే సమయం లో చాలా ఖచ్చితంగా ఉంటాడు అట. అయితే మన మహేష్ బాబు అప్పులు వసులు చేసేపుడు, ఇచ్చేపుడు జరిగే సంభాషణలు చాలా ఫన్నీ గా ఉంటాయట. సినిమాలో ఊహించని ట్విస్ట్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద సినిమా మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తరహాలో డైరెక్టర్ పరుశురాం చూపించ నున్నట్లు సమాచారం.