సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి గారే నిబంధనలు అతిక్రమిస్తే ఎలా..?

వాస్తవం ప్రతినిధి: తాజాగా కర్ణాటక హెల్త్ మినిష్టర్ బి శ్రీరాములు చిత్ర దుర్గ జిల్లా చల్లకేరే తాలూకా పరశురాంపురంలోని దేవాలయాన్ని సందర్శిస్తూ సోషల్ డిస్టెన్స్ అనే మాట మర్చి పోయి చేసిన పనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి గారే నిబంధనలు అతిక్రమిస్తే..ఇక ప్రజల మాటేమిటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు మన నెటిజన్లు. అసలు విషయమేమిటంటే..

కర్ణాటక హెల్త్ మినిష్టర్ బి శ్రీరాములు చిత్ర దుర్గ జిల్లా చల్లకేరే తాలూకా పరశురాంపురంలోని దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా అయన అనుచరులు భారీగా తరలి వచ్చి ఆయనకు ఆపిల్స్ గజమాల తో సత్కరించే ప్రయత్నం చేసారు. ఆ సమయం లో కేరింతలు కొడుతూ ఒకరి మీద ఒకరు పడి పోతూ భౌతిక దూరం అనే మాట మర్చిపోయారు. సామాజిక దూరం పై సామాన్యులను ఎడ్యుకేట్ చేయాల్సిన సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి ఇలా వ్యవహరించటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనికి ఫైనల్ టచ్ ఏంటంటే ఆ ప్రోగ్రాం ముగింపులో మంత్రి గారు మళ్ళీ సోషల్ డిస్టెన్స్ గురించి సుద్దులు చెపారట.