దేశ రాజధాని సరిహద్దులు మూసివేత..కీలక నిర్ణయం తీసుకొన్న కేజ్రీ సర్కార్!

వాస్తవం ప్రతినిధి: వారం రోజుల పాటు ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం తీసుకొన్నట్లు సీ ఎం తెలిపారు.

ఈ మేరకు విలేకరులతో మాట్లాడిన ఆయన అత్యవసర సర్వీసుల మాత్రం మినహాయింపు కల్పించినట్లు చెప్పారు. పౌరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత.. మళ్లీ సరిహద్దులు తెరువాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. ఆటోలు, ఈ-రిక్షాలు, ఇతర వాహనాల్లో ప్రయాణికుల సంఖ్యపై ఉన్న నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లలో షాపులు తెరిచేందుకు సరిబేసి విధానాన్ని ఇన్నాళ్లూ అమలు చేశామని, కానీ ఇప్పుడు ఆ విధానాన్ని ఎత్తివేసినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. బార్బర్‌ షాపులు, సెలూన్లను తెరవనున్నట్లు చెప్పారు. స్పాలు మాత్రం మూసి ఉంచనున్నారు. అన్నీ దుకాణాలు ఓపెన్‌ చేసుకోవచ్చని సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించారు. మేం సరిహద్దులు తెరిస్తే దేశవ్యాప్తంగా ప్రజలు ట్రీట్‌మెంట్‌ కోసం ఢిల్లీకి వస్తారు. ఢిల్లీ హాస్పిటల్స్ ‌ మాత్రం ఢిల్లీ ప్రజలకు మాత్రం రిజర్వ్‌ చేసి ఉంచారు. అదే సమయంలో ఢిల్లీ అనేది దేశానికి చెందినదే. అందుకని దేశ ప్రజలకు ట్రీట్‌మెంట్‌ చేయబోమని ఎలా నిరాకరించగలం అని కేజీవ్రాల్‌ అన్నారు.