అల్లర్లతో అట్టుడుకుతున్న అమెరికా.. 25 నగరాల్లో కర్ఫ్యూ

వాస్తవం ప్రతినిధి: ‘ఐ కాంట్‌‌‌‌ బ్రీత్‌‌‌‌’ ఆందోళనలు హింసాత్మకమవడంతో అమెరికా వ్యాప్తంగా 25 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. న్యూయార్క్‌‌‌‌ నుంచి లాస్‌‌‌‌ ఏంజెలెస్‌‌‌‌ వరకు సిటీల్లో పోలీసులను మోహరించారు. 11 నగరాల్లో నేషనల్‌‌‌‌ గార్డ్స్‌‌‌‌నూ రంగంలోకి దింపారు. పోలీసులు నిలువరిస్తున్నా, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. పలు ప్రాంతాల్లో పోలీసుల వాహనాలను, భవనాలను ఆందోళనకారులు తగలబెడుతున్నారు. దుకాణాల్లో లూటీలకు తెగబడుతున్నారు. పదులు, వందల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి విధ్వంసానికి పాల్పడుతూ పోలీసులపై తమ కోపాన్ని చాటుతున్నారు. ఫిలడెల్ఫియాలో 13 మంది పోలీసులు అధికారులు ఈ హింసాత్మక నిరసనల్లో తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద కూడా జాతీయ సైన్యం అప్రమత్తమైంది. శాన్‌ఫ్రాన్సిస్కో, అట్లాంటా, లూయి్‌సవిల్లె, లాస్‌ ఏంజెలెస్‌, పోర్ట్‌లాండ్‌, కొలంబియా తదితర 25 నగరాల్లో ఎమర్జెన్సీ కర్ఫ్యూలు విధించారు. వైట్‌హౌస్‌ వద్ద జరుగుతున్న నిరసన ప్రదర్శనను రిపోర్ట్‌ చేసేందుకు వెళ్లిన ఫాక్స్‌ న్యూస్‌ రిపోర్టర్‌ను ఆందోళనకారు లు తరిమికొట్టారు. అక్కడే కాదు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాత్రికేయులపై, మీడియా ఫొటోగ్రాఫర్లపై తీవ్రదాడులు జరగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటిదాకా ముగ్గురు మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు, పోలీసులు గాయపడ్డారు. 17 నగరాల్లో 1400 మందికిపైగా నిరసనకారులను అరెస్టు చేశారు.