బంక‌ర్‌లో దాక్కున్న డొనాల్డ్ ట్రంప్

వాస్తవం ప్రతినిధి: న‌ల్ల‌జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపిన కేసులో.. అమెరికా అత‌లాకుత‌ల‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం కూడా వాషింగ్ట‌న్ డీసీలో భారీ స్థాయిలో ఆందోళ‌న‌లు మిన్నంటాయి. అధ్య‌క్ష అధికార భ‌వ‌నం శ్వేత సౌధం వ‌ద్ద కూడా నిర‌స‌న‌లు హోరెత్తాయి, దీంతో అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ట్రంప్ ప్రాణాలు కాపాడేందుకు వారు బంక‌ర్ల‌ను ఉప‌యోగించారు. న‌ల్ల ‌జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపిన కేసులో దావాన‌లంలా ఆందోళ‌న‌లు హోరెత్త‌డంతో.. వైట్‌హౌజ్‌లో ఉన్న అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను.. ఆ నివాసంలో ఉన్న అండ‌ర్‌గ్రౌండ్‌ బంక‌ర్‌లోకి తీసుకువెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అమెరికాకు చెందిన ప్ర‌ముఖ‌ దిన‌ప‌త్రిక ద న్యూయార్క్ టైమ్స్ ఈ మేర‌కు ఓ సంచ‌ల‌న క‌థ‌నం రాసింది. బంక‌ర్‌లో దాగిన ట్రంప్‌.. సుమారు అక్క‌డ గంట సేపు గ‌డిపిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత ఆయ‌న్ను మ‌ళ్లీ పై అంత‌స్తు‌కు తీసుకువ‌చ్చారట.