తెలుగునాట పేదలను ఆదుకునేందుకు “నాట్స్” మరో ముందడుగు..!

వాస్తవం ప్రతినిధి: తెలుగునాట లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం “నాట్స్” తన వంతు సాయం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కర్నూలు పాతబస్తీలో 500 పేద కుటుంబాలకు ఆహార పంపిణీ చేసింది. కరోనా లాక్‌డౌన్‌తో పనులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు , పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక పెద్దలు కొందరు నాట్స్ ఉపాధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి నిరుపేదలకు కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు ముందుకొచ్చారు. బాపయ్య చౌదరి సాయంతో స్థానిక పెద్దలు 500 కుటుంబాలకు ఆహార పంపిణీ చేశారు. కరోనా వల్ల పనులు లేక ఉపాధి కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితుల్లో తమకు అండగా నిలిచి సాయం అందించిన నాట్స్ ఉపాధ్యక్షులు నూతి బాపయ్య చౌదరిని స్థానిక నాయకులు, నిరుపేదలు ప్రశంసించారు.