నా బిల్డింగ్ కాలిపోయినా ఫరవాలేదు.. అతడికి న్యాయం జరగాలి : ఎన్నారై

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో శ్వేతజాతి పోలీసు అధికారి, నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ ని తొక్కి చంపిన విషయం తెలిసిందే. నల్లజాతీయుడి హత్యతో అమెరికా ఆందోళనలు, విధ్వంసాలతో అట్టుడికిపోతుంది. మిన్నపొలిస్‌ నుంచి న్యూయార్క్‌ వరకు.. ఇటు అట్లాంటా నుంచి లాస్‌ఏంజెల్స్‌ వరకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో నిరసనలు తీవ్రమవడంతో పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దుకాణాలు, రెస్టారెంట్లను కూడా తగల బెట్టారు. కాగా.. నిరసనల్లో తగలబడ్డ రెస్టారెంట్‌లలో ఓ ఇండియన్‌కు చెందిన రెస్టారెంట్ ‘గాంధీ మహల్’ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ యజమాని స్పందిస్తూ.. “నా బిల్డింగ్ కాలిపోయినా ఫరవాలేదు. కానీ జార్జి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలి. జార్జి ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీసులకు శిక్ష పడాలి’ అని నిరసనకారులకు తన మద్దతు తెలిపారు..